చెలిప్రేమ
చెలిప్రేమ
సిగలోని మల్లెలకు..సిగ్గెలా ఉంటుంది..!?
చెలిప్రేమ వానలో..మబ్బెలా ఉంటుంది..!?
విరహమే చూడగా..కాల్చు నా వేదనే..
చెలితోడు లేకున్న..సుఖమెలా ఉంటుంది..!?
అందాల జాబిల్లి..చెలిమనసు కనవేమి..
తననవ్వు వెన్నెల్లొ..తగవెలా ఉంటుంది..!?
ఆశతో పోరులో..అలసటే భాగ్యమా..
మౌనాల గగనాన..పరుగెలా ఉంటుంది..!?
చెలిమి నే కోరేటి..చెలి వలపు అందమే..
చెలి ఎదురుచూపులో..విసుగెలా ఉంటుంది..

