STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

చెలిమి పూల వీణ

చెలిమి పూల వీణ

1 min
19

నా తియ్యని పూలవీణ..తస్కరింత బాగున్నది..! 

నీ చూపుల సరాగాల..చెంగలింత బాగున్నది..! 


ఎటుచూస్తే అటునీవే..కనిపిస్తూ ఉన్నావుగ.. 

నీ తలపుల మల్లెచెండు..పలకరింత బాగున్నది..! 


చెలిమికాంతి వర్షంలో..నీ కనులకు దాసోహం.. 

ఈ తనువే పొందుతున్న..పులకరింత బాగున్నది..! 


నీవు రాని వేళలన్ని..విరహాద్భుత గీతాలే..

వేనవేల వలపులతో..చకిలిగింత బాగున్నది..! 


ఎడారిలో వసంతమై..పూసిందే నీ హాసం.. 

భావగగన వీధులలో..ఊరడింత బాగున్నది..!


Rate this content
Log in

Similar telugu poem from Romance