చెలిమి నెమలి
చెలిమి నెమలి
నిరంతరం గురువువోలె నిలుచునుకద చెలిమినెమలి
ప్రియముతోడ వెలుగుబాట చూపునుకద చెలిమినెమలి
ఎక్క గోరు ఎవరెస్టును ఎక్కించే దెవరునీకు
గమ్యానికి నిజమార్గం తెలుపునుకద చెలిమి నెమలి
నీ నీడగ తానునిలిచి రక్షించును ఎల్లప్పుడు
నీకాళ్ళకు గుచ్చుముళ్ళు తీయునుకద చెలిమి నెమలి
నమ్మకాన్ని నిలుపుకునే తోడెవ్వరు కడదాకా
నీజీవిత రహస్యాలు దాచునుకద చెలిమినెమలి
మనసున వెన్నెల చిలుకుట మాన్యులకే చెల్లునులే
తిమిరంలో దివ్వెవోలె వెలుగునుకద చెలిమినెమలి
ఎంతదవ్వు కేగిననూ నీ'లోనే ఉండుబీవి
ప్రగతివైపు నీఅడుగులు నడుపునుకద చెలిమినెమలి

