STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

చెలిమి మీర

చెలిమి మీర

1 min
228

కోటికలల తీరమేదొ..చేర్చినావె చెలిమిమీర..!

మౌనవీణ శృతిచేయగ..నేర్పినావె చెలిమిమీర..!


లేదు ఆశ..లేదు కోర్కె..ఉండు చాలు ఇట్లాగే..

కనురెప్పల కోవెలలో..నిలచినావె చెలిమిమీర..!


వెతుకులాట పనేలేదు..నీ ముద్దుల తోట చాలు..

జగమంతా ఒక్కతీరె..నిండినావె చెలిమిమీర..!


నా వేదన ఆసాంతము..రద్దైనది నీ దయతో..

నీ ఊహల ఊయలలో.. నిలిపినావె చెలిమిమీర..!


గోర్వెచ్చని తనువుమాటు..చైతన్యపు సాక్షి నీవె..

మంచుపూల జల్లులలో..తడిపినావె చెలిమిమీర..!


Rate this content
Log in

Similar telugu poem from Romance