చెలిమి మీర
చెలిమి మీర
నా మనస్సు నా జేబున..కలమైనది ..చెలిమిమీర..!
అక్షరాల మౌనానికి..వనమైనది..చెలిమిమీర..!
సంచరించు తలపులన్ని..ముద్దాడెను గగనాలను..
ఈ తనువున తన ఉనికే..వరమైనది..చెలిమిమీర..!
భావనమే మెరుపుపూల మధుశాలగ మారె కదా..
'నేను,నాది' తన పదముల..పరమైనది..చెలిమిమీర..!
సత్యమేదొ బోధపడగ..పంచుతోంది అదేపనిగ..
అంతులేని చిరునవ్వుల..ధనమైనది..చెలిమిమీర..!
ఆశయాల నిట్టూర్పులు..ఆవిరయ్యె చిత్రముగా..
నిర్వికార లోగిలిలో..తపమైనది..చెలిమిమీర..

