చెలీ
చెలీ
చెలీ...
నీ జ్ఞాపకాల సంతకాలు...
నా ఎద ఫై ఉన్నంత కాలం...
నే ఎన్నటికీ వాడని కుసుమాన్నే...!
నీ అడుగుల ముద్రలు...
నా ఇంటి ముంగిట ఆరని వెలుగైనంతకాలం...
నే ఎన్నటికీ నిశి చూడని తూరుపునే...!
నీ చిరునవ్వుల సరిగమలు...
నా పయనం లో వీనుల విందైనంతకాలం...
నే ఎన్నటికీ శృతి తప్పని జీవన రాగాన్నే...!!!
