STORYMIRROR

Midhun babu

Romance Classics

3  

Midhun babu

Romance Classics

చెలి నీది

చెలి నీది

1 min
5

తీపి చెరకు పాల వెన్న తినిపించే చెలిమి నీది..!

మోహవీణ తంత్రులన్ని సవరించే చెలిమి నీది..!


నా తనువున అణువణువున నింపినావు నీ తలపే..!

స్వప్నగగన వీధులన్ని పండించే చెలిమి నీది..!


నా కన్నుల చిత్రాలకు ప్రాణమూదు మౌననిధీ..!

అనుక్షణం స్వర్గాలను వెలిగించే చెలిమి నీది..!


నా పలుకుల రాగాలకు స్వరములేల కూర్చేవో..!

అందముగా సరిగమలను కురిపించే చెలిమి నీది..!


నా పదముల అందియలకు శ్వాస సాక్షి యైనావే..!

నా నటనల కావ్యాలను రక్షించే చెలిమి నీది..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance