చేయి చేయి
చేయి చేయి


ప౹౹
చేయి చేయి కలిపాక చేరువాయెనే మనసు
హాయి హాయి కలిగాక ఆశపెంచినే వయసు ౹2౹
చ౹౹
చెప్పలేని పరవశమే చెప్పకనే కమ్మివేసెనుగ
తప్పలేని తనువూ తమకమే నమ్మివేసెనుగ ౹2౹
కోరికే పెంచే ప్రేమలో కొత్తదనమే మదినిండా
కొరగాని అంశం లేశమంతలేని వలపుజెండా ౹ప౹
చ౹౹
తనువు తమకాలే తామరాకుపై బిందువులే
మనసులో యోచనలే మనసైన బందువులే ౹2౹
ఉండిపోవునే గుండెలో గురుతునే మరువక మండిపోదులే ఆ వలపూ ఎన్నడూ చెరుపక ౹ప౹
చ౹౹
చేరివచ్చిన చెలిమి చేర్చినే చెరిసగం హాయీ కూడిమెచ్చినే కులుకు కువకువ కనుదోయీ ౹2౹
ఆశల అంతరంగం అణుకువనే మరి వీడగా
ఊసుల ఉబలాటం అలాదరిచేరినే తోడుగా ౹ప౹