STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

చాలు చాలు

చాలు చాలు

1 min
260

నీ నవ్వుల నదిలో నను..విసిరేస్తే చాలుచాలు..!

నీ చూపులు సంకెళ్ళుగ..వేసేస్తే చాలుచాలు..!


మురిపించే నీ అందెల..సవ్వడులే విందు చాలు..

నా మనసును చెప్పకనే..దోచేస్తే చాలుచాలు..!


వర్ణించగ కాళిదాసు..కాను కదా..మాటలేవి..

నీ వలపులు నా కొఱకే..దాచేస్తే చాలుచాలు..!


ప్రేమలేఖ వ్రాయబోతె..వెక్కిరించె అక్షరాలు..

ఏమైనా హృదయాలను..కలబోస్తే చాలుచాలు..!


మరి గట్టిగ అనుకున్నా..నీతోనే జీవితమని..

నా శ్వాసను నీకోసం..నిలిపేస్తే చాలుచాలు..


Rate this content
Log in

Similar telugu poem from Romance