బ్రతుకులో సాంకేతిక ప్రభావం
బ్రతుకులో సాంకేతిక ప్రభావం


బ్రతుకులో సాంకేతిక ప్రభావం
రోజురోజుకూ మనుషుల ద్వారా చేసే విధానాలు తగ్గిపోతున్నాయి,
సరికొత్త సాంకేతిక పరిజ్ఞాన ప్రభావంతో స్వయంచాలక యంత్రవిధానాలు పెరుగుతున్నాయి |౧|
దశాబ్ది దశాబ్దికీ అమలు చేయబడుతోంది కృత్రిమ వివేకం ,
కుతర్కంతో ఏట ఏటా పదాన్వేషులకు కష్టమవుతోంది ఉద్యోగం దొరకటం |౨|
ఒకప్పుడు వార్తాసౌకర్యాల కొరకు ఉండేది ఆకాశవాణి,
ఈనాడు ప్రజావాణి కోసం ఉపయోగబడుతోంది చరవాణి |త్రీ|
ఆనాడు ఉండేది ఒకే ఒక్క దూరదర్శన వాహిని,
అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయింది ఈ ప్రజావాహిని |౪|
ఈ రోజు ఉన్నాయి ఎన్నో వార్త దూరదర్శిని మాధ్యమాలు,
కానీ ఈ అమ్ముకుపోయిన సంస్థల చెప్పావు నిజమైన వార్తావిశేషాలు |౫|
ఉపగ్రహ మాధ్యమం మనిషికి అమూల్య వరం,
అంతర్జాలం తో ఆరంభం అయ్యింది సౌకర్యాల ఆవిష్కారం |౬|
దూరవాణిలో దర్శన సదుపాయం దూరమున్నవారికి దగ్గర చేసింది,
చురుకైన చరవాణిలో సౌకర్యాల ప్రయోగం దగ్గర వారిని దూరం చేసింది |౭|
ఈ రోజులలో ఎవరు ఎవరితోనూ మాట్లాడటంలేదు,
ఈ కృత్రిమ పరిజ్ఞానంతో ఎవరు ఎవరి వద్ద ఉండటంలేదు |౮|
బ్రతుకులో ఉన్నాయి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మంచి -చెడు ప్రభావాలు,
ప్రతి మనిషి అలోచించి గ్రహించి ప్రయోగించాలి ఈ ఆధునిక పరికరాలు |౯|