బ్రతుకు వైభోగం
బ్రతుకు వైభోగం
వయసుతో పనిలేని లోకంలో వున్నాను,
బ్రతుకు వైభోగం సరికొత్తగా తెలుసుకుంటున్నాను,
కొంటెతనపు కోరికలు
ముదిరిన వయసులో ముచ్చటిస్తున్నాను.
మరుమల్లెల పరిమళము
వింతకాపురాన వేగలేనంటున్నది,
కవ్వించే మనసే
కలలగూటికి సాక్షిగా వుండనంటున్నది,
ఆరు అంకెల జీతము
శాంతి మధువు కాలేనంటున్నది,
రంగుల హంగుల లోకంలో
శ్రీమతి
ప్రణయ గగనం చూడాలంటున్నది,
ప్రేమ పూలతోట
సరసరాగాలకు దూరమైనది.
మనసువిప్పి చెప్పలేని బాధలతో
యువతీ యువకుల యవ్వనం
బలై పోతున్నది,
మనసులోని ఆశలు
తీపి వలపుల పల్లకి ఎక్కలేనంటున్నది,
పెద్దల పెద్దమనసే
నవ్వులవెన్నెలగా మారాలని
యువత తహతహలాడుతున్నది,
పరువాల పరిహాసాన్ని పరీక్షించక
వెన్నలింట ముద్దుముచ్చట్లతో బ్రతుకు పండాలని
దేవుడినే యువత వేడుతున్నది.