మట్టి చేతులు
మట్టి చేతులు


అతని చేతులకు మట్టి మహా నేస్తమే..!!
అతని చేతులుభూమితల్లికి పచ్చని కాంతులహారాలు..!!
అతని చేతుల శ్రమ
ప్రపంచానికి బువ్వ మెతుకు..!!
మట్టి తల్లి ఒడిలో
తానెప్పుడూ నిత్య శ్రామికుడే..!!
అరుగాలం శ్రమించినా శ్రమ ఫలం అనుభవించనోడు...!!
తాను క్షయమై ప్రపంచానికి
అక్షయపాత్రై నోడు...!!
పుడమితల్లి తొలకరికి తడిచిపోతే
పులకించి నేలతల్లికి చిక్కు దీసి దువ్వెటోడు..!!
పొంగారు బంగారు పంటలనే దీసే రారాజే..!!
పెట్టిన పెట్టుబడైన రాక దళారుల
చేతుల్లో మౌనంగా బలౌతున్న దిక్కుతోచనినిస్సహాయుడు...!!
అతివృష్టి, అనావృష్టి
జూద
ం లో పందేమేసేఆటగాడు..!!
ఆత్మహత్యల యజ్ఞంలో గింజలా
రాలి కాలిపోయే సమిధనే..!!
ప్రసంగాల్లో మాత్రమేఒలికేకల్లబొల్లి
గౌరవమర్యాదలు
దేశానికి రైతే రాజు ,రైతే వెన్నెముక
అని పేరు గొప్ప ఊరు దిబ్బగా
చెప్పేవన్ని గొప్పలే
చేతలన్ని రైతు మెడకు ఉరితాల్లే..!!
క్రూరమైనదళారీ వ్యవస్థపాదాలక్రింద నలిగిపోతున్నా..!!
తాను నమ్మిన మట్టి తల్లిని విడువనోడు
తానెంత నాశనమైన
మట్టి తల్లి తనప్రాణమని
సేద్యమే తన ధ్యేయమని
దేశ ఆర్థికవ్యవస్థకు మూలాధారమైనోడు..!!
అతడే నిజమైన భూపుత్రుడు
మన కంచపు అన్నం ముద్దైన రైతన్న..!!