కాలం తీరు
కాలం తీరు


తరగిపోతున్న కాలానికి
తరచి చుాసే పనిలేదు
తరుగుతున్న యవ్వనానికి
మిడిసిపడే హోయలు లేదు...
పరుగుల జీవితానికి
పగ్గాలదుపు లేదు
కాలే కడుపులను
నిత్య అక్షయపాత్ర లేదు...
విధిగా నిలిచే తలరాతలను
మార్చే నాధుడు లేడు
విధాత నడిపే అడుగులకు
వారధి కుార్చేవారు లేరు....
విధియైనా యదార్ధమైనా
విజయమైనా అపజయమైనా
అన్యాయమైనా అవినీతైనా
బంధాలైనా అనుభుాతులైనా..
అలసినా ఓడినా వెలుగెత్తి చాటినా
చలించినా బరువై కృషించినా
భగవంతుని రాతలై విరాజిల్లుచుండు
నిజమన్నది నమ్మని లోకమై
వ్యధలన్ని నిండిన బ్రతుకై!