నాలోకి ❤️
నాలోకి ❤️


నా కళ్ళ నుంచి నిద్రను దోచుకున్న నా మధురమైన
ఉగ్రవాదివి నువ్వు….
ఎప్పుడూ నీ పేరు రాస్తూ స్మరించుకునే నా మనసు క్షేమమే….
అలాగే నా ఊహలకు తగినట్టు తపించేనా నీ మనసు
అని తెలుసుకోవాలనుకుని ఆరాటపడుతున్న నా మనసు పదిలమే…
నువ్వు నాకు పరిచయమైంది ఒక కవితలాగానే…
మాటలకే అంతు చిక్కని అన్ని విషయాలనూ
నీ చూపులలో నింపి తీసుకొచ్చావు నాలోకి...