కావాలి చిరస్మరనీయం
కావాలి చిరస్మరనీయం


కులం మతం మంటు వాదమెందుకు
మనం మనం ఒకటి అంటు పద ముందుకు
చరిత్రలే వున్నవి సాక్ష్యాలు ఇందుకు
మనలో మనకు కక్ష లెందుకు
మూడు నాళ్ళు ఉండి పోయేటందుకు
రంగులలో వేరుగాని దేహం
ఒకటే కదా అందు ప్రవహించె రక్తం
నువ్వు తిన్నది నేను తిన్నది అన్నమొక్కటే కదా
ఆ అన్నము పండే నేల అందరికీ ఒక్కటే కాదా
కలహాలు ఎందుకు విలహాలు ఎందుకు
అంత కలిసి పోదాం పదా ముందుకు
వేరు వేరు అయితెనేమి దైవాలు
అందు వున్నది ఒక్కటే కదా ఆంతర్యము
వేదాలు శాస్త్రాలు కోరేవి మన క్షేమాలు
కాలాన కనిపించు లోకాలు సూన్యాలు&n
bsp;
అన్ని తెలిసి నడిచి గెలవాలి జీవితాన్ని మనిషి
భోగ భాగ్యాలు బూడిదలో పన్నీళ్లు
రాగ ద్వేషాలు నీటిలో బుడగలు
భూతేశ్వరుల లీలలు అగుపించునవి భువ్విలో
కారాదు నువ్వు మట్టి బొమ్మ మనిషి
నిలవాలి స్థిర స్థాయిగా నీలో మృగాన్ని గెలిచి
నీ యంత నాయంత అన్న అహము విడిచి
కళల సీమలో కలహసీమలు పుట్టరాదురా
మమతల హృదిలో కలతల సడులు తేరాదురా
అభ్యుదయ భావాల తరంగిణివై తరలి పోవాలి
తర తరాల చరితలో భావితరంలో ఆదర్శమవ్వాలి
గొప్ప గొప్ప కీర్తి పతకాన్ని ఎందుకోవాలి
ఈ జగతిలోన మేటిగా నిలిచి పోవాలి..