STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

3  

Midhun babu

Classics Fantasy Others

వదిలేసేయ్

వదిలేసేయ్

1 min
139


ఏనిమిషం ఏమౌనో దైవానికి వదిలేసేయ్

ఏ భారం మోయాలో కాలానికి వదిలేసేయ్


తప్పులేవి చేయనట్టి మనిషుండడు లోకంలో

ఏ పాపం చేశావో కర్మానికి వదిలేసేయ్


ఎంత నీవు శ్రమించినా కలిసి రావటం లేదా

ఏ ఫలితం ఇస్తుందో భాగ్యానికి వదిలేసేయ్


లక్ష్యాలను చేరేందుకు ఆటంకం ఉండవచ్చు

ఏ గమ్యం చేరాలో పయనానికి వదిలేసేయ్


ప్రతిరోజూ వినిపించే పుకార్లనే నమ్మవద్దు

ఏది జరిగి ఉంటుందో సత్యానికి వదిలేసేయ్


ఎంత ఘనత నీకున్నా నీవెపుడూ చెప్పరాదు

ఏం గొప్పను చెబుతుందో సంఘానికి వదిలేసేయ్


ప్రాణంపై తీపినేది ఎంతున్నా ఓ 'హంసా'

ఏక్షణాన వస్తుందో మరణానికి వదిలేసేయ్



Rate this content
Log in

Similar telugu poem from Classics