ప్రియురాలా
ప్రియురాలా


కనుల ముందు నీ రూపం కదిలిందే ప్రియురాలా.
కళ రాకనె నీ చిత్రం గీసితినే. ప్రియురాలా..!
ఆమనిలో కోకిలలే కమ్మనైన. పాటపాడ
నీ పాటయె నా గుండెలొ. మ్రోగేనే. ప్రియురాలా..!
గున్నమావి తోటలోన ప్రకృతి కాంత చెంతచేర
నా మనసే రంగులుగా అద్దితినే ప్రియురాలా..!
నది లోనీ గలగలలే నీ నవ్వుగ. భావించా
నగు మోమే నందనమని తలచితినే ప్రియురాలా.!
పరిమళాల సుమగంధం శ్వాసగానె పలకరించ...
నీ రాకను(నీరాక...అను) సమీరమే. వ్యాపించెనే ప్రియురాలా....!