గణతంత్ర దినోత్సవ
గణతంత్ర దినోత్సవ


దేశభక్తి కనులలోన చూపేందుకు వీలుకాదు
మాతృభక్తి మనసులోంచి తీసేందుకు వీలుకాదు
జవానులా కరవాలం పదునెంతో చూపలేము
సైనికులా దరహాసం చూపేందుకు వీలుకాదు
భారతీయతంటేనే హృదయం ఉప్పొంగుతుంది
దేశమాత ఋణమెంతో తీర్చేందుకు వీలుకాదు
ప్రత్యర్ధుల గుండెల పై శాసనాలు రాయాలీ
జయలక్ష్మిని చూపకుండ దాచేందుకు వీలుకాదు
శాంతి శాంతి అంటుంటే అలుసేకద ఓ శ్యామా
వీరోచిత పోరాటం ఆపేందుకు వీలుకాదు....