బ్రతుకు చిత్రం
బ్రతుకు చిత్రం
అమ్మచేతి ముద్దతినే..ఆశలేని బతుకుచిత్రం..!
దేశరక్షణ కొరకుగాక..బ్రతకలేని బతుకుచిత్రం..!
మండుటెండ వెన్నెలల్లె..తలచు ధీర నారీమణులు..
సుఖముమాట కలనుకూడ..ఎత్తలేని బతుకుచిత్రం..!
కన్న తల్లిదండ్రులెవరొ..దేశమాత అర్థమేమో..
యుద్ధమేదొ మనసుపట్ల..జరుపలేని బతుకుచిత్రం..!
విశ్వప్రేమ మాటేమిటి..వెర్రిమనసు పిచ్చితనమే..
మనశ్శాంతి పొందగాను..ఎఱుకలేని బతుకుచిత్రం..!
ఎవరి సినిమా వారిదే..జన్మకర్మ చక్రమందున..
తోలుబొమ్మలాట సాక్షి..నిలువలేని బతుకుచిత్రం..!
సమరవాంఛ రాలిపోగ..జ్ఞానమిచ్చు ననుభవాలే..
ఏదినేను ఎవరు నీవు..తెలియలేని బతుకుచిత్రం..!
