STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

బంగారం

బంగారం

1 min
23.3K


ప౹౹ పోతపోసినా బంగారమూ తరుణి తనువు జత చేసినా సింగారమే ఆ రమణి చనువు ౹2౹


చ౹౹ వల్లమాలిన వలపుతనమే ఆ వదనమంత ఎల్లలెరుగని ఎలమికి మదిలో కదనమంత ౹2౹


చల్లబరిచే సన్మోహనమే కోరిన సన్నిహితం పల్లమెరుగని ప్రణయ కలయికలే ఉన్నతం ౹ప౹ చ౹౹


కనిపించగనే కలవరమే పెరుగునే కనులలో వినిపించగనే నాదమే దివ్యమైనే వీనులలో ౹2౹


కోరికే కొండలా బలిసి కొదమతేరి ఊరించా ఊరికే ఉండని మది కూడ ఉవ్విళ్లూరించా ౹ప౹ చ౹౹


దివ్యస్వర్గం దిగివచ్చి దిగంతంలే వెలిగించ భవ్య మనసులే ఆ భారమునూ తొలగించ ౹2౹


ఒడిసి పట్టేసి ఆ బంగారాన్ని ఓలలాడించగ నడచి వచ్చేయునే కనక నవకమై వరించగ ౹ప౹


Rate this content
Log in