STORYMIRROR

Dinakar Reddy

Abstract Children Stories Fantasy

4  

Dinakar Reddy

Abstract Children Stories Fantasy

బంగాళాఖాతంలో..

బంగాళాఖాతంలో..

1 min
376

చుట్టూ చెట్లు

కనుచూపుమేరంతా సముద్రం 

మెల్లిగా అడుగులు వేసాను


బంగారపు రంగులో ఉంది ఇసుక 

మోకాళ్ళ లోతు నీళ్లలో ఉన్నాను

ఆకాశం భూమి కలిసే చోట 

తళుక్కుమని మెరిసింది


అల ఒకటి ఫెళ్లుమని కొట్టింది

దెబ్బకి ఆలోచనలు ఎగిరిపోయాయ్

నేస్తాల చేతులు పట్టుకుని 

వచ్చే అలను డీ కొట్టాను

నవ్వుతూ ఎగిరి పడ్డాం


తీరమంతా మనుషులతో నిండిపోయింది

అందరూ ఇసుక పూసుకున్న రాళ్ళలా అనిపించారు

ఆ ఉప్పునీరు కదులుతోంది

శిరస్సు నుంచి పాదాల దాకా మమ్మల్ని ముంచుతూ

మాతో పాటు మునుగుతూ ఉంది

ఎంత ప్రయత్నించినా లోపల ఏముందో 

చూడలేకపోయాను

సరిగ్గా మన మనసులాంటిదే కదా ఆ సాగరం కూడాను


బంగాళాఖాతంలో సముద్ర స్నానం

నవ్వులతో గడిచిన సాయంత్రం

ఒక అందమైన చోటు

నన్ను నేను కలుసుకున్నాను


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract