STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Drama Fantasy

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Drama Fantasy

బంధం విలువ

బంధం విలువ

1 min
357

నాలో ఉన్న అవ్యాజమైన ప్రేమని 

వ్యక్తపరచడం నా వల్ల కాలేదు 

అర్ధం చేసుకోవడం నీ వల్లా కాలేదు 

మనిద్దరి మధ్యన 

నిశ్శబ్దమనే గోడ కూల్చడం 

ఎవ్వరి వల్లా కాలేదు 

నిన్ను చూసినప్పటినుంచీ

నాలో కలిగిన భావాలు 

నాకే స్పష్టంగా అర్ధం కాలేదు

నీకెలా చెప్పేది 

నీ నవ్వులోని ఆత్మీయత 

నీకే స్పష్టంగా తెలియదు 

నేనెలా స్పందించేది 

ఈ బంధాలు బద్దలుకొట్టుకునే 

ఈ ఆధునిక ప్రేమికులకు 

గుండె బద్దలవడం 

అర్ధమయ్యే విషయం కాదులే 

ఏనాటికైనా ఈ బంధం విలువ 

నీకు తెలుస్తుందనే 

ఆశతో జీవిస్తున్నాను 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract