బిందియా
బిందియా
నీవు ఎలా వున్నావని..అడుగుతోందీ బిందియా..!
సిందూరపు వెన్నెలలే..పంచుతోందీ బిందియా..!
దిగులుపడే అద్దానికి..ఓదార్పెలా ఇచ్చునో..
చిరునవ్వుల దారాలను..ఏలుతోందీ బిందియా..!
చెక్కిలింటి రాగాలకు..స్వరములెలాగ కూర్చునో..
మెఱుపువీణ తంత్రులలో..ఆడుతోందీ బిందియా..!
దివ్యప్రణయ చైతన్యపు..కేంద్రమైనది హృదయమే..
అంతరంగ విశ్వాలకు..నడుపుతోందీ బిందియా..!
చూపలేని రహస్యాల..వంతెనాయెనె మానసం..
నిత్యచెలిమి నేత్రముగా..వెలుగుతోందీ బిందియా..!
ఆరురుచుల సారమదే..దాచుకున్నది జాణయై..
కర్మచక్ర బంధాలను..రాల్చుతోందీ బిందియా..!

