STORYMIRROR

Midhun babu

Inspirational

4  

Midhun babu

Inspirational

బిగియని పిడికిలి

బిగియని పిడికిలి

1 min
242

: బిగియని పిడికిలి


నకిలీ పురుగుమందులతో

నాశనమై పోనీ...𝓶

తను కన్నపంట ధర 

తార్పుడు గాడి

చేతిలో తగలబడనీ.....

కార్పొరేటర్ల నడుమ నలిగిపోనీ

సహనాన్ని మెడకు చుట్టుకుని

శుష్కమందహాసమ్ చెస్తాడే కానీ....

పుడమిని నమ్ముకున్న రైతన్న

పిడికిలి బిగియదు!


అనుకోని దౌర్భాగ్య స్థితిలో

అంగడిబొమ్మగా మారిన

నిర్భాగ్యపు మహిళ

దేహాన్ని దుప్పటిగా పరిచి

నిరామయంగా మిగిలి పోతుంది

అధరాలలో రుధిరం చిప్పిల్లనీ

మానంలో మలినాలు ఎక్కించనీ

మండుతున్న సిగరెట్టుతో 

వాతలు పెట్టనీ

ఆ పిడికిలి బిగియదు!

బెత్తెడు పొట్టకోసం


మేకల ముసుగులో తోడేళ్ళు

సంచరిస్తూనే ఉన్నాయి సమాజమంతా

పుట్టిన బిడ్డ, పండిన ముసలి

ఏదైతేనేం రాక్షసక్రీడకు?


ఆదిపరాశక్తీ!

అబలవు కావు నీవు

కదలిరా!కదలిరా!

కావోష్ణపు రక్తాన్ని

కరాలలో ,నరాలలో ప్రవహించనీ

బిగించు పిడికిలి రేపటికోసం

మరో ప్రపంచం కోసం


 .... సిరి ✍️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational