STORYMIRROR

# Suryakiran #

Romance

4  

# Suryakiran #

Romance

బిగికౌగిలి !

బిగికౌగిలి !

1 min
1.2K

ఎంత హాయి చల్లనిరేయి !


పండువెన్నెలతో భువిని


మరింత అందమైనసీమగా


చీకటి మార్చుతున్నదోయి !


పగలంతా మనిషిమనిషి


తనను తాను మున్ముందుకు


నడిపించుకొనుటలో


తీరికలోను ఆలోచనల సాగరంలోనే !



సంధ్యవేళలో భానునికి ,


నలువైపులా పరచుకున్న


చెట్లనీడలోని శోభకు


మరోమారు వీడ్కోలు పలుకుటలో !



ఊరూవాడా బారులుతీరిన


రంగురంగుల దీపకాంతులలో


ఆటపాటలలో మునిగితేలే


యువతరం హద్దులను తాకుటలో !



ఊరించే కౌగిలింతల హోరులో


మధురోహల పల్లకీలలో


రేయంతా కంటిరెప్పల వెనుక


ఏదో ఒకరోజు నిజమయ్యే


గంటల నిడివిగల కలల అలల్లో !!






Rate this content
Log in

Similar telugu poem from Romance