STORYMIRROR

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

బహుముఖ బాటసారి

బహుముఖ బాటసారి

1 min
218

శీర్షిక:బహుముఖ బాటసారి

******************

పుట్టుకే ముళ్ళ పానుపు 

బతుకే రాళ్ళ బాట


మనసేమో సుతిమెత్తని పువ్వు

దేహమేమో కంటకాలు రువ్వు


దుర్వినీత లోకంలో

దునుమాడే నాలుకలకు

అంగాంగాలనే కంటకాలుగా మలచి

గుచ్చే చూపులకు

నొప్పించే మాటలకు

పదునైన జవాబుగా నిలుస్తున్నాను


శాఖోపశాఖలుగా విస్తరించి

విరితావినై ప్రేమనూ పంచుతున్నాను

వింటితాడునై తలనూ తెంచగలను


బహుముఖాలుగా సంచరిస్తూ

నన్ను నేను మలుచుకుంటూ

నాకు నేనుగా నాతో నేనుగా

సాగుతూనే వుంటాను..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy