STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

భావాల కడలి

భావాల కడలి

1 min
0

మనసేమొ ఒక మంచు..ముద్దలా ఉందిపుడు..! 

చెలిచూపు ఒక మల్లె..వానలా ఉందిపుడు..!


ఎదలోని మౌనమే..మంత్రించె తియ్యగా.. 

తన పిలుపు నన్నేలు..నీడలా ఉందిపుడు..! 


భావాల కడలిలో..పదములే మయ్యాయొ.. 

తననవ్వు ఒక పూల..పడవలా ఉందిపుడు..! 


ఏ మధువు త్రాగాలి..తనవలపు ముసురులో.. 

తనతలపు లాలించు..పాటలా ఉందిపుడు..! 


కరువైన మాటలే..కథ చెప్ప సాగెలే.. 

తన అలుక ఒక మెఱుపు తీవలా ఉందిపుడు..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance