STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

భాషలోనే భావమా...

భాషలోనే భావమా...

1 min
4


కనుచూపు తాకగానే 

మొదలయిన ప్రణయమా!!


రాయలేని కావ్యమా..!!


చిరునవ్వు రువ్వగానే

యదలయన ప్రళయమా!!


మనసున ఆశల తరంగమా..!!


తొలిఈడు హద్దేలేని పతంగమా

రంగురంగు పూలకలల వసంతమా!!


అందాల రసకేళి గీతమా..!!


హృదయమే ఆలపించే వలపురాగమా..!!


పరివిధాల పరితపించు పసిపరువమా!!


నీ పెదవులొలుకు జుంటెతేనే మధురిమా..!!


నీపరువపు మిసమిసల సరిగమ..!!


సౌందర్య రాశులెన్నో దాచిన 

అత్యాద్బుత సౌందర్య రాశివే ప్రియతమా...!!!!!!


            


Rate this content
Log in

Similar telugu poem from Romance