భారతమాతకు వందనం
భారతమాతకు వందనం
.దీరుగ విశ్వమంతటను ధీధితి జిమ్ముచువెల్గుచుండు మా
.భారత జీవ యాత్రకిది భవ్య పథంబును జూపగన్ సదా
.చారము నేర్చి పౌరులిట సత్త్వగుణంబుల తోడ వర్ధిలన్
.శారద మాత పుత్రులయి సత్కవితాసుధ పంచు వేల్పులై
.తీరిచి దిద్ది శిష్యులను దెల్గున నేర్పుచు పద్య విద్యలన్
.భారతి సారసత్త్వమున పండితులార్యులు నైన యొజ్జలన్
.దోరపు బుద్ధితో గొలిచి దోసిలి యొగ్గి నుతింతు నిత్యమున్.//