భాగ్య ముందు
భాగ్య ముందు
ఒక బంగరు సూర్యునిలా..కదలుటయే భాగ్యమందు..!
విశ్వానికి మిత్రునిలా..మిగులుటయే భాగ్యమందు..!
మొద్దునిదుర వీడకుండ..ఆరోగ్యం ఉండునెలా..
మెలకువతో కలలపంట..పొందుటయే భాగ్యమందు..!
కోకిలలా పాడాలని..కాకికసలు తెలియదులే..
నీ ప్రతిభను నీవుతెలిసి..వెలుగుటయే భాగ్యమందు..!
సాధనమున పనులు సమకూరుననె వేమన్న నాడు..
చేదువేపమాటు తీపి..అందుటయే భాగ్యమందు..!
పుటముతోటి ఇనుము ఏల..మారగలదు పసిడిగాను..
సత్యమెఱుకలోన సరిగ..నిలచుటయే భాగ్యమందు..!
గజలు వ్రాయగాను ప్రేమగాయపు పచ్చి మానరాదు..
మాటచాటు మౌననదిని..మునుగుటయే భాగ్యమందు..!
