బావ సరసం భామ విరహం
బావ సరసం భామ విరహం
కనకాంబరాలనూ గిరిజాల కొప్పులో తురిమేసి
చీనాంబరాలనూ సుకుమారి వంటికే చుట్టేసి
పచ్చలహారాన్నీ మెడలోన ఇంపుగా సరిచేయ
పెళ్లి సంబరాలా బావొచ్చి మెచ్చుకొనె చోద్యమే
ఎర్రనివి పచ్చనివి మట్టిగాజులతోడు
బంగారు కంకణాలు వేసిన చేతులను
గోరింటా పండిన కరపల్లవాలనూ
బావగాంచి మురిసీ ప్రస్తుతించె చిత్రమె
కుండలాలు నీచెవి వేలాడి ఘంటికల
నాప్రేమ తెలపగా జాగేల మరదలా
రావోయి షికారూ పోదుమని పిలువగా
ముక్కున వేలేసి ఆశ్చర్య చకితనైతి
నామెడ మూడుముడులు వేసిన తరువాతా
నీవెంట నరకానికి అయినా వస్తాను.....
అన్నమాట జవదాట! బావా! మరలిపో!
పెద్దవారి మాటనిలిపి నువ్వు మసలుకో!

