బాటసారినై
బాటసారినై
నేనెవరో తెలిసికూడ తెలియనట్టు బ్రతకలేను..!
అన్నింటా అందరిలో..నినుచూడక ఉండలేను..!
ప్రేమకు నిజచిరునామా..అందుకోగ యాతనేమి..
నీ దు:ఖం నీ బాధా..తీర్చకుండ కదలలేను..!
బాటసారినై మిగిలా..ఈపూవుల తోటలోన..
పూవులేవి తెంచలేను..పూజించక నిలువలేను..!
నాకథకో సూత్రధారి..ఇంకెవరో ఇంకెక్కడ..
పాత్రకెలా అంటకుండ..ఉండాలో చెప్పలేను..!
నీ లోపలి నాతీరుకు..అచ్చెరువే కలుగుచుండు..
మౌనం నా సంపదంటు..పెదవివిప్పి పాడలేను..!
గురిపెట్టిన ఒక తుపాకి..బుల్లెట్లే అనుభవాలు..
చిరునవ్వుల వెన్నెలనే..కవచమసలు తీయలేను.
