బాల్యమే
బాల్యమే
ఆటలో ఆటగా..ముగిసెనా బాల్యమే..!
పాటకే పాటగా..నిండెనా బాల్యమే..!
భోగమో భాగ్యమో..తెల్పగా తక్కువే..
నీడకే నీడలా..కూడెనా బాల్యమే..!
చిగురులో ఆకులో..మొగ్గలో పూవులో..
మెల్లగా పండులా..రాలెనా బాల్యమే..!
నేలలో మట్టిలో..నింగిలో మబ్బులో..
చినుకులో తేనెలా..మురిసెనా బాల్యమే..!
నీటిలో పాలలో..గాలిలో నిప్పులో..
మనసులో తనువులో..మాగెనా బాల్యమే..!
అమ్మతో నాన్నతో..ఇంటిల్లిపాదితో..
పండుగో పబ్బమో..గడిపెనా బాల్యమే..!

