STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

బాగున్నవి

బాగున్నవి

1 min
143


వేకువలో నింగి నుదుటి సిందూరం బాగున్నది

చీకటితో వెలుగు కొరకు పోరాటం బాగున్నది


అతని కవితలో పదాలు వెన్నెలలో ముంచుతాడు

ఆమె బుగ్గలో విరిసిన మందారం బాగున్నది


కడలి అలలతో తీరం చెప్పిన ఊసులు ఎన్నో

ఇరుమనసులు కలిసినపుడు సంగీతం బాగున్నది


మబ్బు వెనక భానుమూర్తి ఉన్నాడని తెలియలేదు

దాగుడుమూతలు ఆడే మైదానం బాగున్నది


పండై తను రాలినపుడు విత్తులన్ని రాల్చుతుంది

భూమాతకు సమర్పించు నైవేద్యం బాగున్నది




రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance