STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Romance Fantasy

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Romance Fantasy

అవ్యక్త ప్రేమ

అవ్యక్త ప్రేమ

1 min
300

నా మధుర భావనలు

వ్యక్త పరచేలోగానే 

నువ్వు దూరమై పోయావు 

నా మనోగాధ లోతులు 

నీకు నివేదించే లోగానే 

నువ్వు దూరమై పోయావు

ఆ వెన్నెల కురిసిన రాత్రి 

నువ్వూ రాలేదు, నేనూ పిలవలేదు 

బిడియం ప్రేమ వ్యక్తీకరణకు 

తొలగించలేని ఆటంకమయ్యిందని 

నీకు విన్నవించేలోగానే 

నువ్వు దూరమై పోయావు 

అయినా 

ఎక్కడ మనోహర 

పుష్ప సుంగంధాలు వ్యాపించినా 

ఎక్కడ మనోకల్ప 

సంగీతం వినిపించినా 

ఎక్కడ కాల్పనిక 

అందెల రవళులు వినిపించినా

ఎక్కడ కమ్మ తెమ్మెరలు 

పరవశానికి గురిచేసినా 

మనోహరమైన నీ ఉనికిని 

నేను అనుభవిస్తూనే ఉంటాను  


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract