STORYMIRROR

Srinivasa Bharathi

Romance

4  

Srinivasa Bharathi

Romance

అవునా? శ్రీనివాస భారతి

అవునా? శ్రీనివాస భారతి

1 min
364

నీకోసం

ఒళ్లంతా కళ్ళు చేసుకున్నా

అందం

మనసునుండి పుట్టాలని

గుండె తలుపు తీసి ఉంచా

ఒక సుమూహూర్తంలో

నన్ను పలుకరించావు

నమ్మలేని ఊసులు పంచుకున్నావు

ఎంత ఆనందమో

నీ కోసం అక్షరాలు పుడితే

నిన్ను నిన్నుగానే ఆరాధిస్తా

ఆ చోటు ఇంకెవరికీ దక్కదు

పాత జ్ఞాపకాలను నెమరేస్తూ

తొంభై ఏళ్ళు గడిపేస్తాలే

నలభై ఐనా ఏమిటి లోటు

నీ మాటలు నన్నాకర్షిస్తే

నా మాటలు ఆకట్టుకోవెందుకని?

ఇరవైలో అరక్షణం ఆకర్షణ కన్నా

నిశ్చలమైన నా భావం నిజం

ఆకర్షణ మాత్రం కాదు...

నన్ను కట్టిపడేసే అంతర్సౌందర్యం

నీ దగ్గరుందని తెలిసాక

నిన్నెలా వదులుకొను?

నా మనసును గెలిచిన మాటలు

నీ పెదవులు తాకి బైటకు వస్తే

ఎంతఆనందమో కదా...

ఎప్పటికీ నిన్నలానే

ప్రేమగా గుర్తుంచుకొంటా

పాత మధురాల్ని తలబోస్తూ

ఈ దూరం ఇంకెన్నాళ్లు

సూర్యుడ్ని మబ్బులు దాయలేవుగా..

హృదయం చీల్చి చూస్తేనే

మనోవేదన బయట పడేది.

చుక్కలు లెక్కలేస్తున్నాయి

దూరం చెరిగేదెప్పుడని

ఏ స్వార్ధం లేని ప్రేమ

కవికి ఊపిరి పోస్తుంది....

------------****************---------------



Rate this content
Log in

Similar telugu poem from Romance