STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

అవకాయ

అవకాయ

1 min
7


కడబట్టే ప్రాణాలను..నిలబెట్టును ఆవకాయ..! 
తలచగనే జిహ్వనెంతొ..ఊరించును ఆవకాయ..! 

పులుపుగల్గి పీచుండీ..రసాలైతె భేషంటా.. 
స్వర్గపు అసలంచులనే..దాటించును ఆవకాయ..! 

కొత్తలోన ఎంతరుచో..అంత కమ్మదనములే.. 
ఎక్కువైతె ఎచటెచటో..మండించును ఆవకాయ..! 

వేడివేడి వరియన్నం..తోటికలిపి నెయ్యిలేక.. 
తింటే సామీ నాట్యం..ఆడించును ఆవకాయ..!

ఎంత మజా ఏమిరుచీ..కాంబినేషన్ల మాటా.. 
అంతులేని ప్రకంపనలు..పుట్టించును ఆవకాయ..! 

మనిషిమనసు రహస్యమే..దాచుకున్న ఆమ్రఫలం..
తగినంతగ సేవించుట..నేర్పించును ఆవకాయ..!


Rate this content
Log in

Similar telugu poem from Classics