STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అతిశయోక్తి

అతిశయోక్తి

1 min
6

నా గుండె నీ సమాధిలో..ఉండెనంటే అతిశయోక్తా..!

నా శ్వాస నీ ఊసులందే..మునిగెనంటే అతిశయోక్తా..!


ఈ తోటలో ప్రతిమోడు నీ నవ్వుకోసం వేచె చూడు..

నా మనసు నీ పూజలోనే..నిలచెనంటే అతిశయోక్తా..!


సమిధలెన్నో బూడిదయ్యెను ప్రణయాగ్ని కీలలలో.. 

నా తలపులు నీ ధ్యాసలోనే..కాలెనంటే అతిశయోక్తా..!


ప్రళయమేదో సంభవిస్తే విశ్వమే మాయమై పోవుగాక.. 

మన ప్రేమ శూన్యగగనము..నంటెనంటే అతిశయోక్తా..!


సముద్రాలే ఇంకిపోనీలే అసలు చెలిమి ఇగిరే గంధమా..

మనను కలిపిన మౌనమే..ఉరిమెనంటే అతిశయోక్తా..! 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance