అతఃశ్చేతన
అతఃశ్చేతన
ఎన్ని మౌనాలు మోయను ఙ్ఞాపకాలతో మాటాడుకుంటూ
ఎన్ని అక్షరాలు స్రవించనుభావాలలో బంధించుకుంటూ
కాలానికి కన్నీళ్ళు అంకితమిచ్చినాఆరిపోడంలేదు
గుండెతడి అనుభవాల అంతుతెలుసుకున్నా అర్ధంకావడంలేదు
మౌనమదిఉరికిన ఊహలన్నీగతమైన ఆనందాలు
విహరించిన స్నప్నసామ్రాజ్యాలన్నినిలిచిపోయిన నిన్నటి
కలలురెప్పలు మూయని రాత్రులుశూన్యంలో నిలిచిన
నిర్వేదపు చూపులునిన్నలు నిడివి పెరిగినేటిలో సంచరిస్తున్నాయి
రేపటి ఆశలు అంతుతెలియకఅగాధంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి
సన్నగిల్లిన శశ్తులన్నీసంకల్పాన్ని మోస్తున్నాయి
కాలమాగదు కన్నీటిపయనమైనాచీకటీ ఆగదు
వేకువ వెలుగును స్వాగతించకుండా....

