STORYMIRROR

sesi saradi

Abstract Drama Tragedy

4  

sesi saradi

Abstract Drama Tragedy

అసంతృప్తి

అసంతృప్తి

1 min
336

               అసంతృప్తి


జీవిత చరమాంకంలో తృప్తిగా కనుమూయాల్సిన సమయంలో 

ఏదో అసంతృప్తి!


ఎన్నో సాధించాలనుకున్నా ,

ఏమీ చెయ్య లేకపోయాననే 

అసంతృప్తి !


ఎంతో నైపుణ్యాన్ని సాధించినా,

దానిని ఏ విధంగానూ

ఉపయోగించలేదనే అసంతృప్తి! .


సామర్ధ్యం ఉన్నా అన్నింటిలోనూ,

అందరి తోనూ

 వెనుకబడి పోయాననే

 అసంతృప్తి! .


ఎంతో రాయాలని ఉంటుంది

ఏమీ రాయలేక పోతున్నాననే

 అసంతృప్తి!.


అందరినీ సంతోష పెట్టాలని చూసి 

నా సంతోషాన్ని 

మరచి పోయాననే 

అసంతృప్తి!


స్నేహితులతో మనసుతీరా

 మాట్లాడాలని ఉంటుంది 

అది కుదరక ఎంతో

 అసంతృప్తి!


చిరుజల్లు పడుతున్నవేళ సంగీతం 

వినాలనే కోరిక , 

కోరికగానే మిగిలిందనే 

అసంతృప్తి !.


అందరి కోసం సమయం వెచ్చించి

నా కోసం సమయం

 కేటాయించు కోలేక పోయాననే 

అసంతృప్తి!



ఇప్పటికీ దేనికీ

 ధైర్యం చెయ్యలేక పోతున్నాననే అసంతృప్తి!




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar telugu poem from Abstract