STORYMIRROR

Baswaraj Mangali

Classics Others

4  

Baswaraj Mangali

Classics Others

అశ్రునయనం

అశ్రునయనం

1 min
327

కురియవేమే కన్ను

ఉరిమి జూచిన నిన్ను?

అశ్రుమిశ్రమ అబ్రకముతొ నిండి,

అరుణవర్ణము ఆమంతము పులిమి!

కడలిజడులన సుడులువడివడిన క్రమ్మినట్లు!

తోచిన్ నాకు నిన్ను జూచి!

అయినను,

ఆనాదే అశ్రుధార ఏది?

కురియవేమే కన్ను

ఉరిమి జూచిన నిన్ను?

సాయంత్ర యంత్ర తంత్రుల మేనును

మీటగా రావు,

కమల కోమల వల్లి! నెచ్చలి! నా చెలి! వేల్లనీ

ఎరిగినను,

ఝాంఝా భరిత

వింజా సహిత

జోరు హోరు వానన,

ఏకాకై ఓ కాకి విలపించే!రోధన, వేదన!

ఆ వేదన ఆవేదన నీదని తెలిసినా

కురియవేమే కన్ను

ఉరిమి జూచిన నిన్ను?

శిశీర శిరమున విరిగి జారి,

తరువు తెంచిన తనకున్న పాషాన్ని తలచి!

వగచి-వగచి

     ఏడ్చినది,

                  ఓ ఎండుటాకు

అది నీవని నమ్మినను!

కురియవేమే కన్ను

ఉరిమి జూచిన నిన్ను?

ఆనదే అశ్రుదారా ఏది?

నువ్వొస్తే నేనింక నిలువనేమోనని,

నా నుండి నువ్వింక వెడలిపోనని,

మిగిలింది నాకింకా నువ్వే

అనిపించి కాబోలు!

కురియవు కన్ను

ఉరిమి జూచిన నిన్ను................



Rate this content
Log in

Similar telugu poem from Classics