Praveena Monangi

Inspirational


4  

Praveena Monangi

Inspirational


అర్థరాత్రి

అర్థరాత్రి

1 min 127 1 min 127

అర్థరాత్రి


ఒకప్పుడు ఎంతో ప్రశాంతముగా ఉండేది ,


ఎంతో ఆనందముగా ఉండేది ,


ఏకాంతముగా ఉండేది, నిశ్శబ్దముగా ఉండేది,


సూది పడినా ఉలిక్కిపడేది ,


తనని తాను తలచుకొని గర్వపడేది ,


తనంత అదృష్టవంతురాలు ఎవరు లేరనుకునేది ,


తాను మాత్రమే కాక అందరికీ ప్రశాంతతను,ఆరోగ్యాన్ని ఇస్తున్నానని తనలో తానే సంతోషపడేది ,


కాని ఆ అర్దరాత్రికే దిష్టి తగిలింది ,


ఆ ఆనందము, ఏకాంతము, ప్రశాంతత అన్నీ మాయమయిపోయాయి ,


షికారు కోసం పాపం, రోడ్డు మీదకి వెళ్లింది అర్దరాత్రి ;అక్కడ వాహనాల హోరు, కుక్కల అరుపులు,


పరుగెత్తుకొని ఒక ఇంట్లో దూరింది,అక్కడ మొబైల్ ఫోన్ల మెసేజెల కిచకిచలు ,మాటలు.


పక్కన బార్యభర్తల మద్య ప్రశాంతత వెతుక్కుంది ,కానీ అక్కడ గొడవలే ;పొలాల వైపు పరుగెత్తింది ,అక్కడ నీళ్ళ మోటర్ల శబ్దాలు,


లాభం లేదని ,ఎత్తయిన భవనాల వైపు పరుగు తీసింది ;అక్కడ సెల్ టవర్ల వైబ్రేషన్లు ,బార్లలోన ,క్లబ్బులలోన ,ఇలా ఎక్కడ చూసినా శబ్దాలే ,అర్దరాత్రికి నిశ్శబ్దమే కరువయ్యింది.


అరణ్యానికి వెళ్లింది, అక్కడ మానవుడు చెట్టులు ,కొండలు కొట్టి బిల్డింగులు కట్టేశాడు.


అర్దరాత్రి దిగులు పడింది ,తనకి రోజులు అయిపోయాయని ,మౌనము గా ఈ దేశాన్ని వదిలి దూరముగా వెలిపోదామని అనుకుంది, వెళ్లిపోయింది మనందరిని వదిలి,కాదు మనమే దూరం చేసుకున్నాము,అర్దరాత్రిని,నిశ్శబ్దాన్ని,ప్రశాంతమయిన నిద్రను ,జీవితాన్ని........


ఈ కవిత సుజనరంజని అనే అంతర్జాల పత్రిక లో మార్చి 2016 సంచికలో ప్రచురింపబడింది


Rate this content
Log in

More telugu poem from Praveena Monangi

Similar telugu poem from Inspirational