STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

అర్థం అయింది

అర్థం అయింది

1 min
9


అర్థం అవుతోంది నాకు..!!


ఏమర్ధమౌతుందో చెప్పనా నీకు ..!!


"నా" మనసుకు హాయిగొలిపి

నిలువెల్లా పరిమళించేవి "నీ" తలపులేననీ ..!!


ఋతువైన వసంతంలా "నీ" మనసు విరులతో జతచేరి నా మనసెందుకో మరింత విరుస్తోందనీ ..!!


పిల్లగాలికి విన్నవించుకుంటున్నా "నా" విరహాన్ని "నీకు" విన్నవించమనీ..!!


"నా" శ్వాసలో "నీ" నామమే నిత్యం జపిస్తోందనీ...!!


"నా"విరహపు తాపంతో "నీలో" ఏకమై 

"నీ" ఊపిరిలో చేరి గుండె లయలుగా ప్రతిధ్వనించనీ...!!


"నీ" కర (చేత) స్పర్శకోసం తపించే "నా" మనసు "నీ" మనసుకు తెలియాలనీ ..!!


ముసురు పట్టి నిండు మేఘమై వర్షమై కురిసి "నా" తనవును పులకించనీ...!!


"నా" ప్రేమ పదాలు "నీ" హృదయసీమను అమాంతం తడపనీ ..!!


"నువ్వు" దూరంగా ఉన్నావని "నే"ననుకోను ..!!


"నీ" మాటల్లో కలిసిపోయాను..!!


"నీ" పెదవుల్లో ఉచ్చరిస్తున్నాను..!!


"నీ" శ్వాసలా మారిపోయాను..!!


"నీ" కదలికలకు నీడనయ్యాను.!!


"నీ" నిదురలో స్వప్నమయ్యాను..!!


"నేను" నీతో ఉన్నట్టే నువ్వు జీవించే ప్రతి క్షణమూ..!!


"నా"కే సొంతం ..!!


"నీ" స్మృతిలోనే "నేను" కదులుతుంటానెప్పటికీ..!!


గులాబీ మేను కలిగిన "నిన్ను" హిమబిందువుల ప్రతినిత్యం "నిను" తాకుతూనే ఉంటాను..!!


పండు వెన్నెలవైన "నిన్ను" మంచుతెరలా "నేను"కమ్ముకుంటూనే ఉంటాను...!!


"నీ" నిరీక్షణలో వత్సరాలను క్షణాలుగా మార్చేస్తాను...!!


"నీ" మదిలో నిత్యం మౌనరాగంగా మారిపోతాను...!!


గోధూళిలా మారి "నీ" పాదాలను అనునిత్యం తాకుతూనే ఉంటాను..!!


చెరగని పుట్టు మచ్చనై "నీ" తనువుకు అంటుకుపోతాను...!!


నిత్య వసంతంలా "నీ"కు "నా" 

ప్రేమను పంచుతూనే ఉంటాను...!!


వర్షమై కురిసి "నీ" వలపులనలా తాకి కురిసి మురుస్తుంటాను..!!


లలిత కళలుగా మారి "నీ" చేతి వేళ్ళ స్పర్శతో మీటించుకుంటూనే ఉంటాను..!!


శిశిరంలో రాలిన ఆకులవంటి మనోభావాలను "నీ" మనసులో రానీయక వసంత రుతువుగా "నీ" మదిలోకి చేరుకుంటాను ..!!


"నీ" కనులు చదివే కావ్యంగా మారిపోతాను ..!!


"నీ" సంతోషపు కూనిరాగంగా "నీ" మనసులో చేరిపోతాను ..!!


ప్రతినిత్యం "నీ" కనుల ఆనందభాష్పాలుగానే రాలిపోతాను ..!!


నేను నేను కాదు నీవనే నీచేత అనిపించుకుంటాను............!!!!!!!!!!


    


Rate this content
Log in

Similar telugu poem from Romance