అరకన్నుల
అరకన్నుల
మనసు అడవి కాల్చేందుకు మునుగవేమి అరకన్నుల..!?
విరహాలను పేల్చేందుకు నిలువవేమి అరకన్నుల..!?
మాటలలా మరతుపాకి తూటాల్లా ఎందుకటా..!?
కటకటలను ఆపేందుకు చూడవేమి అరకన్నుల..!?
కనురెప్పల లయమాధురి మాటునున్న వనమేదో..!?
బాధలన్ని వదిలేందుకు మిగులవేమి అరకన్నుల..!?
బంధాలకు గంధాలను నింపేందుకు ముచ్చట సరె..
తాపాలను వీడేందుకు తలచవేమి అరకన్నుల..!?
తనువుగాక వెలుగుపూల తోటలేదు గమనిస్తే..
అసలు మధువు పొందేందుకు ఆగవేమి అరకన్నుల..!?

