అన్వేషణ
అన్వేషణ
గుప్పెడు గుండెకు
ఉప్పెనంత ఊహలు
పిడికెడంత ప్రాణానికి
బోలేడన్నీ ఆశలు
గతమేమైనా
వదిలేయాలి
నేడేమైనా
అనుభవించాలి
రేపటి మీద మాత్రం
గంపెడంత ఆశతోనే
బ్రతకాలి మరి
ఆశలు ఆశయాలు
తీర్చుకునే మార్గంకై
అన్వేషణ సాగించాలి
ఆశల గమనం
అతుకుల గతుకులైనా
ఆలోచనకు పదును
పెట్టి సాగాలి
ఆశయ తీరం
ఎగుడుదిగుడులైనా
నేర్పుకు సాన
పెట్టి సాగాలి
ఆశలు ఛిద్రమైన
ఆశయాలు భీతిల్లినా
భయం భూతం బెదిరించినా
మానస సరోవరం
ఎగసి పడును
అభయమనే హస్తం వుందిగా
అదరక బెదరక
కుదురుగ మెదులుతు
గమ్యం చేరడమే
లక్ష్యం అధిగమించడమే
మనో సంకల్పం ముందు
అసాధ్యమన్నది
మోకరిల్లక తప్పదు
