అనురాగము లాహిరి
అనురాగము లాహిరి
సాగే ఈ జీవితమే అనురాగపు లాహిరి
అందులోని సంసారం అనుబంధపు లాహిరి
తొలివలపుల మధురోహలు విరబూసాయంటే
మొట్టమొదటి చెలిస్పర్శ సిరిగంధపు లాహిరి
మాటల్లో మధువునింపి చెవిలోనే పోయును
ప్రియా అనే చెలియపిలుపు హాయివలపు లాహిరి
పికమైనా సాటిరాదు ఆమెగాన ఝరితో
చెలియగాన లహరిలోన హాయిగొలుపు లాహిరి
స్వప్నాలతొ నాచెలియకంతస్నేహ మేమో
స్వప్నలోక విహారైన ఆమెతలపు లాహిరి

