STORYMIRROR

Midhun babu

Romance Classics

3  

Midhun babu

Romance Classics

అనుక్షణం

అనుక్షణం

1 min
7


అనుక్షణం నీ ఇష్టం..తీర్చాలని చూస్తున్నా..!

నీ శ్వాసకు ఓ సాక్షిగ..నిలవాలని చూస్తున్నా..!


నువు మెచ్చే మెఱుపుతీవ..ఈ తనువే అనుకోనా..

వర్షమైన నీ చూపున..తడవాలని చూస్తున్నా..!


నన్నేలే స్వరధారన..నీ తలపే మంత్రము కద..

నీ పెదవుల కదలికలో..మునగాలని చూస్తున్నా..!


అలంకార ప్రాయమైన..ఈ కాలం మౌనగీతి..

వినిపించే నీ జతలో..కరగాలని చూస్తున్నా..!


నెలవంకల వయారాల..కొలువున్నది నీ నవ్వున..

నీ పాటల కోవెలలో..వెలగాలని చూస్తున్నా..!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance