అనుక్షణం నీతోనే నీ వున్నా
అనుక్షణం నీతోనే నీ వున్నా
నీ పెదవుల మాటు మౌన వేణువుగా ఉండుటెలా..?!
నీ నగవుల వెలుగుచున్న ప్రాణముగా ఉండుటెలా..?!
అనుక్షణం అనునిత్యం నాతోనే నీవున్నా..
నీ చూపుల ఆడుతున్న రూపముగా ఉండుటెలా..?!
చినుకు పూల ఎద లయలో మారుమ్రోగుతుంటావే..
నీ సొగసుల వెదుకుతున్న దీపముగా ఉండుటెలా..?!
తారలకే మూలమైన కాంతి నదివి నీవేగా..!!
నీ తలపుల కరుగుతున్న రాగముగా ఉండుటెలా..?!
జగములకే సుధలెన్నో పంచి పెట్టు ప్రియ సఖియా..!!
నీ వలపుల మరుగుతున్న నాదముగా ఉండుటెలా..?!

