STORYMIRROR

AnuGeetha Adiraju

Romance Others

4  

AnuGeetha Adiraju

Romance Others

అనుబంధం❤️

అనుబంధం❤️

1 min
410

"మనసా మనసా మాటాడవే మనసా..

తెలుసా తెలుసా ఏమాత్రమైనా తెలుసా...

   నువు లేనిదే జతే లేదుగా..

   నిను చేరలేని వ్యధే నాదిగా...

   పొరపాటునైనా విడి పోని బంధం మనదే అని నీకు తెలుసా...

 మనసా మనసా ఇటు చూడవే మనసా..

 తెలుసా తెలుసా నేనంటే నువ్వని తెలసా....

    ప్రతి కలలలోనూ నీ రూపమేగా..

    క్షణమైన నిను మరువదుగా...

     కొండంత ఆశ దాచుంచా లోలో నీతో నూరేళ్ళు     బ్రతకాలని తెలుసా..

మనసా మనసా నను వీడి పోనని మాట ఇస్తే చాలే మనసా..

తెలుసా తెలుసా ఈ జన్మ నీదేనని తెలుసా...

********************************************

 మనసా మనసా నీకేమంత స్వార్థమే మనసా..

తెలుసా తెలుసా కంటతడి అవుతుందని తెలుసా...

  ఎపుడైనా నిను నేను మరిచానా..

  నీ తోడు ఎపుడైనా విడిచానా...

ఇంకెంత కాలం ఈ గుండె భారం మోయలేని వ్యధ నీకు తెలుసా...

మనసా మనసా పరిహాసమా మనసా...

తెలుసా తెలుసా నిలువెల్ల కాలేనని తెలుసా...

   ఎటు చూడు నువ్వే వదిలెల్లగలనా...

   నిను చేరే దారే కనిపించెనా...

ఎప్పుడైన నేను నీ సొంతమేనని తెలుసా...

నీ కోసమే ఇలా బ్రతికున్న మదిని మీటగ రాలేవా మనసా...."

Anu❤️



Rate this content
Log in

Similar telugu poem from Romance