అనుబంధం
అనుబంధం
ప౹౹
హాసమా చెప్పేవు మరువని ఎన్నో ఊసులు
చిరు దరహాసమా చిగురించనీ చిన్ని ఆశలు
౹2౹
చ||
నవ్వించే నయనం పెంచేనుగ కొత్త కోరికలు
కవ్వించే తరుణం కోసమే వేచే అభిసారికలు
౹2౹
మనసంతా వలపు మయమేగ ఈసమయం
సొగసంతా ఎక్కి సాగెనే ఆ తలపులహయం
౹ప౹
చ||
పన్నీటి పలుకులే పులకరింతలై పురి కొలుప
సన్నటి కులుకులే సరి గమలై మదినే నిలుప
౹2౹
ఎంతటి హాయి కలిగెనో ఈ మంద గమనమే
అంతటి కూరిమి గాలిలోతేలేచంద్రయానమే
౹ప౹
చ||
అధరం దాటి తేనెలజల్లు కురిసే కొత్త పలుకు
మధురం నిండి తనువే చూపే మత్తుకులుకు
౹2౹
ఒకనాటిదా ఈ బంధం ఎంచనూ సంబంధం
ఒక నేటితో ముగియునా ఆ సరిఅనుబంధం
౹ప౹